మహిళనైతే దాచుకోవాలా?

6 May, 2016 19:06 IST|Sakshi
మహిళనైతే దాచుకోవాలా?

స్వీడన్లోని ఓ పాఠశాల విద్యార్థిని తన మహిళావాదాన్ని వినూత్నంగా చాటుకుంది. తన తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలో టాప్లెస్గా కనిపించింది. ఆ ఫోటో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. స్వీడన్ దక్షిణ ప్రాంతంలోని వాగ్జో పట్టణంలో హై స్కూల్ విద్యార్థిని హన్నా బొలాండర్(19) ఇటీవల తన తరగతిలోని మిగతా విద్యార్థులతో కలిసి ఫోటోలకు పోజిచ్చింది. అయితే అందరిలా కాకుండా తాను మహిళనైనంత మాత్రాన శరీరాన్నంతా కప్పిఉంచుకోవాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తూ.. టాప్లెస్గా పోజిచ్చింది. దీనిపై హన్నా మాట్లాడుతూ.. పురుషులు తమ శరీరాన్ని వీలైనంత వరకు బయటకు కనిపించేలా చూపిస్తున్నప్పుడు మహిళలు మాత్రం దాచుకోవాల్సిన అవసరం ఏముంది. ఇది కూడా లింగ వివక్షతే. స్త్రీ, పురుష సమానత్వంపై అవగాహన కలిగించేందుకే ఈ చర్యకు పూనుకున్నాను' అంటూ వివరించింది.

సోషల్ మీడియాలో కొందరు మహిళావాదులు వివక్షపై హన్నా చేస్తున్న వాదనలో నిజం ఉందని వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన తల్లిదండ్రులు ఈ విషయం గూర్చి తెలుసుకొని మొదట కొంత షాక్కు గురైనా తరువాత తనను సపోర్ట్ చేశారని చెబుతోంది హన్నా...
 

మరిన్ని వార్తలు