వాతావరణం బాగోలేదు.. బస్సులో వెళ్లండి

5 Nov, 2017 02:47 IST|Sakshi

లాహోర్‌: తక్కువ వెలుతురు కారణంగా తమ ప్రాంతాలకు బస్సులో వెళ్లాలని ప్రయాణికులకు పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) షాకిచ్చింది. పీఐఏకు చెందిన విమానం అబుదాబి నుంచి పాక్‌లోని రహిమ్‌ యార్‌ ఖాన్‌కు వెళ్లాల్సి ఉంది.  వాతావరణంలో తక్కువ వెలుతురు కారణంగా లాహోర్‌లో ల్యాండ్‌ చేశారు. రహిమ్‌ యార్‌కు బస్సులో వెళ్లాలని పీఐఏ కోరింది. దీనికి నిరాకరించిన ప్రయాణికులు విమానంలోనే కూర్చోవడంతో ఏసీని ఆఫ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాహోర్‌ నుంచి రహిమ్‌ యార్‌ మధ్య దూరం 624.5 కి.మీ. కనీసం ముల్తాన్‌ ఎయిర్‌పోర్ట్‌లోనైనా తమను విమానంలో దింపాలని కోరారు. ముల్తాన్‌ నుంచి 292 కి.మీ. దూరంలో రహిమ్‌ యార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది.  

మరిన్ని వార్తలు