మింగేసిన ఆ మహా ప్రళయానికి పదేళ్లు

30 May, 2016 11:34 IST|Sakshi
మింగేసిన ఆ మహా ప్రళయానికి పదేళ్లు

బాలీ: సొంత నివాసం ఎవరికైనా ఇష్టమే.. అది అందమైన అద్దాల భవంతి కావొచ్చు లేదా.. పండుగల వేళ చేత్తో అలుక్కుని ముగ్గులు పెట్టుకునే పూరిల్లు అయ్యుండొచ్చు. స్థాయికి తగినట్లుగా ఎవరికి వారు నిర్మించుకున్న నివాసం తమ ఊపిరిలో భాగంగా నిలుస్తుంది. అలాంటి నివాసం అనూహ్యంగా కళ్లముందే కనుమరుగై పోతే.. ఓ భూకంపం దాని అనంతరం వచ్చే సునామీ.. దాని వెంటే వచ్చిన ఓ బురద విళయం ఆ నివాసాన్ని నామ రూపాల్లేకుండా చేస్తే ఎలా ఉంటుంది.

ప్రస్తుతం ఇండోనేషియాలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. తాము తరతరాలుగా నివసిస్తున్న నివాసాలను అమాంతం 2006లో వచ్చిన ఓ భయంకరమైన భూవిలయం దాని కారణంగా పోటెత్తిన బురద ప్రవాహం ముంచెత్తింది. దాదాపు 40 వేల మంది నివాసాలను ప్రపంచపటంలో లేకుండా తుడిచిపెట్టేసింది. ఈ విలయంలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా తీసుకోలేని పరిస్థితిలో పదుల అడుగుల బురద వరద పోటెత్తి అయినవాళ్లందరిని మింగేసింది. ఇప్పుడు ఆ సంఘటన జరిగి నేటికి పదేళ్లు పూర్తవుతుంది. ఒక సంస్కృతి, సంప్రదాయలతో పచ్చగా కళకళలాడుతున్న ఆ నివాస ప్రాంతాలను తుడిచి పెట్టేసిన బురద ప్రళయం ఇప్పుడక్కడ మిగిల్చేందేమిటంటే.. వారి నివాస అవశేషాలు.. ఇళ్లు నిర్మించుకోలేని విధంగా మారిన భూస్వరూపాలు. ఇప్పుడక్కడికి సమీపంలోనే అక్కడక్కడ కొన్ని నివాసాల్లో ఉన్న మనుషుల పరిస్థితి మరీ దయనీయం.

చనిపోయిన తమవారికి గుర్తుగా ఆ బురద పొర్లిన ప్రాంతంలో విగ్రహాల్లాంటి బొమ్మలు పెట్టారు. దయనీయంగా కనిపించే ఆ బొమ్మల దృశ్యాలే ప్రస్తుతం వారి కడుపు నింపుతున్నాయి. అవునూ.. ఆ ప్రాంతం ఇప్పుడు టూరిజం క్షేత్రంగా మారింది. వేలమందిని మింగేసిన ఆ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. అలా వచ్చిన వారికి గతంలో ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని వివరించడంతోపాటు విళయానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పోగోట్టుకున్న తమ వారి గురించి చెప్పుకుంటూ స్థానికులే టూరిస్టు గైడులుగా పనిచేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు.

మరిన్ని వార్తలు