బ్రెగ్జిట్‌ అనిశ్చితి.. మే రాజీనామాకు ఒత్తిడి

25 Mar, 2019 04:01 IST|Sakshi

లండన్‌: బ్రెగ్జిట్‌పై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే రాజీనామాకు ఆమె కేబినెట్‌ సహచరులే ఒత్తిడి తెస్తున్నారు. మే ప్రభుత్వ బ్రెగ్జిట్‌ ప్రతిపాదనలపై వచ్చే వారం పార్లమెంట్‌లో మరోసారి ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎంపీలు పదవి నుంచి వైదొలగాలంటూ ఆమెను హెచ్చరించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దిగిపోవాలంటూ మే ను హెచ్చరించాలని వారు భావిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. అలా జరిగితే, ఆమె స్థానంలో డిప్యూటీ ప్రధానిగా ఉన్న డేవిడ్‌ లిడింగ్టన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా అవుతారని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు