పింగాణీ కాదు.. పేక ముక్కలు

10 Sep, 2017 01:36 IST|Sakshi
పింగాణీ కాదు.. పేక ముక్కలు
సాధారణంగా చైనాలో పింగాణీ గిన్నెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న పాత్రలు మాత్రం పింగాణీవే అనుకుంటే పొరపాటే.. ఆ ఫొటోను తీక్షణంగా చూస్తే మీకే అర్థం అవుతుంది.. వీటిని పేక ముక్కలతో తయారు చేశారు. ఇది కొత్తేమీ కాదుకానీ.. మనిషి ఎత్తులో, సహజత్వం ఉట్టిపడేలా పాత్రలను తయారుచేయడం మాత్రం ఇది మొదలు. వీటి రూపకర్త 65 ఏళ్ల జాంగ్‌ కెహువా. ఈ పాత్రలు అచ్చం పోర్సిలిన్‌తో తయారైన పింగాణీ పాత్రల్లా కనిపించడం అతనికి మరింత పేరు తెచ్చిపెట్టింది.

మేస్త్రీ అయిన వాంగ్‌కు కొన్నేళ్ల క్రితం ఒక పాప వీధిలో ప్లేయింగ్‌ కార్డులను చిన్నచిన్న త్రిభుజాకారంగా చుడుతోంది. అది చూసిన వాంగ్‌... ఆ టెక్నిక్‌ను ఉపయోగించుకుని వివిధ ఆకారాల్లో వస్తువులను ఎందుకు తయారుచేయకూడదు అని అనుకున్నాడు. దీంతో తొలిసారిగా అతనికి కలిగిన ఆ ఆలోచనతో పింగాణీ పాత్రల ఆకారాలను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇతను చేసిన ఒక పాత్ర 106 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. అందుకు 5 వేల కార్డులు ఉపయోగించి ఒక వారం రోజుల్లో పూర్తి చేశాడు.
మరిన్ని వార్తలు