కరోనాపై కలిసి జయిద్దాం : ట్రంప్‌తో మోదీ

9 Apr, 2020 10:49 IST|Sakshi

వాషిం‍గ్టన్‌ ‌/ న్యూఢిల్లీ :  కరోనా వైరస్ మహమ్మారిపై కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్రంప్‌ చేసిన ట్వీట్‌కు గురువారం మోదీ బదులిచ్చారు.

అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ముందుగా ట్విటర్‌లో‌ పేర్కొన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేలు మర్చిపోము. ఈ క్లిష్ట కాలంలో మీ బలమైన నాయకత్వం భారత దేశానికే కాదు, యావత్‌ మానవ జాతికి అవసరమని పేర్కొన్నారు.
(భారత ప్రజలకు ధన్యవాదాలు: ట్రంప్‌)


మీరు చెప్పిన దానితో పూర్తిగా అంగీకరిస్తున్నా, ఇలాంటి సమయాలు స్నేహితులను మరింత దగ్గరగా చేస్తాయని  ట్రంప్‌ ట్వీట్‌కు మోదీ బదులిచ్చారు. ఇంతకు ముందుకంటే భారత్‌-అమెరికాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. కొవిడ్‌-19పై యుద్దానికి మానవ జాతి చేస్తున్న పోరాటంలో సహాయపడటానికి భారత దేశం సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తుందని తెలిపారు. కరోనాపై కలిసి జయిద్దామని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు