భారత్‌.. మా విశ‍్వసనీయ భాగస్వామి

19 Oct, 2017 14:39 IST|Sakshi

చైనాకు పరోక్ష హెచ్చరికలు చేసిన అమెరికా

వచ్చే వారంలో భారత్‌కు రానున్న టిల్లర్సన్‌

వాషింగ్టన్‌ : అమెరికాకు భారత్‌ అత్యంత విశస్వసనీయ భాగస్వామి అని అమెరికా సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్ రెక్స్‌ టిల్లర్సన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు నడుస్తాయని ఆయన ప్రకటించారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా-భారత్‌లు.. వందేళ్ల భవిష్యత్‌ కోసం కలసి ముందుకు సాగుతాయని చెప్పారు. కొంత కాలంగా భారత్‌తో ప్రజాస్వామ్య బంధం బలుపడుతోందని చెప్పిన ఆయన.. ఇది మరింద ధృఢతరం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి అమెరికా పనిచేస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌ కలిసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య పరంగానూ అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు అవసరమని ఆయన చెప్పారు. గతంలోనూ, ఇప్పుడు భారత్‌ పలు ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిందని కితాబిచ్చారు.

భారత్‌పై ప్రశంసలు వర్షం కురిపించిన ఆయన.. చైనాపై అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై అంతర్జాతీయ చట్టాలకు చైనా సవాలు చేస్తోందని ఆయన విమర్శించారు. మొదటి నుంచి చైనాతో అమెరికా నిర్మాణాత్మక సంబంధాలనే కోరుకుందని ఆయన అన్నారు. అయితే భారత్‌ వంటి పొరుగు దేశాల సార్వభౌమాధికారాలకు నష్టం కలిగించే రీతిలో చైనా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి సమయంలో భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి. మా భాగస్వామ్య విలువలు ప్రపంచ శ్రేయస్సుకు, శాంతి సుస్థిరతలను కాపాడే విధంగానే ఉంటాయని నమ్మకంగా చెబుతున్నానని టిల్లర్సన్‌ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు