యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్‌

10 Dec, 2023 12:46 IST|Sakshi

యూకేలో వంద రోజుల దగ్గు(100-దగ్గు) వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో దగ్గి..దగ్గి గొంతులో పుండ్లు, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు, ఆపుకోలేని మూత్ర విసర్జన తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులు యూకే అంతట వేగంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. ఇది మూడు నెలలు వరకు సాగే సుదీర్ఘమైన తీవ్ర దగ్గుగా పేర్కొన్నారు. యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం.. గతనెల జూలై నుంచి నవంబర్‌ మధ్య కాలంలోనే దాదాపు 716కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు అధికారులు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా సంక్రమణం అని చెబుతున్నారు.

ఇది గతేడాది 2022లో కాలంలోనే మూడు రెట్లు అధికంగా ఉండేదని, అదికాస్తా ఇప్పుడు మరింత తీవ్రమయ్యిందని తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో లాక్‌డౌన్‌, సామాజిక దూరం వంటి ఆంక్షలు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి తక్కువుగా ఉండేదని, ఇప్పుడూ మాత్రం కేసులు మళ్లీ వేగంగా పెరుతున్నాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇది కోరింత దగ్గు రకానికి చెందిన సుదీర్ఘ దగ్గే ఈ వంద రోజుల దగ్గు. ఇంతకీ అసలు కోరింత దగ్గు అంటే..

కోరింత దగ్గు అంటే..
ఇది బోర్టెటెల్లా పెర్టుస్సిస్‌ బ్యాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల వాయుమార్గాల ఇన్ఫెక్షన్‌ అయ్యి అదేపనిగా దగ్గు వస్తుంది. కనీసం ఏం తినలేక దగ్గి.. దగ్గి.. శరీరం అంతా పులపరంగా ఉండి నీరసించిపోతారు. ఇది శిశువుల్లో, వృద్దుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే 1950లలో టీకా రావడంతో ఆ సమస్య నెమ్మదించింది. అంతేగాదు 1960లలో ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి ఈ అంటు వ్యాధులు ప్రబలేవని, టీకాలు వేయడంతో నియంత్రణలోకి వచ్చేదని బ్రిటన్‌కి చెంది బ్రిస్ట్‌ విశ్వవిద్యాలయ పీడియాట్రిక్స్‌ చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన ముఖ్యంగా శిశువులు, వృద్ధులే పడతారని చెబుతున్నారు. 

ఎదురయ్యే సమస్యలు..

  • జలుబుని పోలీ ఉండే లక్షణాలు ఉత్పన్నమవుతాయి.
  • దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 
  • తీవ్రమైన దగ్గు ఒక్కోసారి వాంతులు లేదా పక్కటెముకలు విరగడం, గొంతు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. 

నివారణ
శిశువుల్లో, వృద్ధుల్లో వచ్చే ఈ కోరింత దగ్గుని తగ్గించొచ్చు. దీనికి అందుబాటులో టీకా కూడా ఉందని ఎన్‌హెచ్‌ఎస్‌ పేర్కొంది.
 

చదవండి: భారత్‌లో 'వాకింగ్‌ న్యూమోనియా' కేసుల కలకలం! ఎవరికీ ఎక్కువ ప్రమాదం అంటే..?

>
మరిన్ని వార్తలు