మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!

9 Dec, 2023 16:25 IST|Sakshi

ఇటీవల కాలంలో చాలా అరుదైన ఘటనలు జరుగుతున్నాయి. వైద్యుల సైతం రోగుల స్థితిని చూసి కంగుతింటున్నారు. మొన్నటికి మొన్న స్కానింగ్‌లో పెద్దపేగులో సజీవంగా ఉన్న ఈగను చూసి విస్తుపోయారు. అది మరువకమునుపే చైనాలో మరో వింత ఘటన చోటు చేసుకుంది. వైద్యులు సైతం ఇదేలా సాధ్యం అని షాకయ్యారు.!

అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన ఓ మహిళ భరించలేని కళ్ల దురదతో బాధపడింది. ఇది సాధారణమైన సమస్యగానే భావించి వైద్యులను సంప్రదించలేదు. ఒక రోజు ఆ బాధను తట్టుకోలేక కళ్లను గట్టిగా నలుపుకుంది. ఇంతలో ఒక పురుగు కిందపడటం చూసి కంగుతింది. దీంతో ఒక్కసారిగా ఆమె తీవ్ర భయాందోళనకులోనై సమీపంలో ఆస్పత్రికి వెళ్లింది. వాళ్లు ఆమె కంటిని పరీక్షించగా కనురెప్పలు, కనుబొమ్మల మధ్య చాలా పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. దీంతో తక్షణమే వాటిని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్యులు.

ఆమె కుడి కన్ను నుంచి 40కి పైగా సజీవ పురుగులను తీయగా, ఎడమ కన్ను నుంచి 10కి పైగా సజీవ పురుగులను తొలగించారు. మొత్తంగా ఆమె కళ్ల నుంచి దాదాపు 60కి పైగా సజీవ పురుగుల(పరాన్నజీవులు) తొలగించరు. ఇలా అసాధారణ స్థాయిలో పరాన్నజీవులు ఉండటం అనేది చాలా అరుదని. ఇది చాలా అసాధారణమైన కేసు అని డాక్టర్‌ గువాన్‌ అన్నారు. ఆమె కంటిలో ఫిలారియోడియా రకానికి చెందిన పరాన్నజీవులు ఉన్నట్లు భావిస్తున్నారు వైద్యులు.

ఇవి ఎక్కువగా కుక్కలు, పిల్లలు శరీరాలపై ఉండే లార్వాలని, అవే ఆమెకు సంక్రమించి ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే చాలామంది తమ పెంపుడు జంతువులను తాకి ముద్దు చేసి మళ్లీ ఆ చేతులనే కళ్లను తాకడం, రుద్దడం వంటివి చేస్తారు. అందువల్ల ఆమెకు ఈ వ్యాది సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్యులు. అలాగే సదరు మహిళను కంటిలో అవశేష లార్వాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అని దాని గురించి తరుచుగా చెక్‌ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఆమెను పెంపుడు జంతువులను తాకితే గనుక వెంటనే కడుక్కోవాలని సూచించారు వైద్యులు. 

(చదవండి: ఆమె నవయుగ సావిత్రి!)

>
మరిన్ని వార్తలు