క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?

23 May, 2020 12:40 IST|Sakshi

సింహాలు ఉన్న చోట సఫారీకి వెళితే ఎంత జాగ్రత్త వహించాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఏ మాత్రం  నిర్లక్ష్యంగా వ్యవహరించిన అది మన ప్రాణాల మీదకు వస్తుందనేది నిజం. తాజాగా సింహాలు ఉన్న చోటుకు సఫారీకని వచ్చిన టూరిస్టులు ప్రకృతిని ఆస్వాదించేందుకని కారును ఆపారు. కారు ఆపిన పక్కనే ఒక సింహాల గుంపు ఉంది. ఇదే సమయంలో కారు డోరుకు లాక్‌ సరిగా లేకపోవడం కారులోని వాళ్లు గమనించలేదు. సాధారణంగానే వాహనాలను చూస్తే మీదకు వచ్చే సింహాలు కారులోని మనుషులను చూస్తే ఊరుకుంటాయా.. ఇంతలో ఆ గుంపులో నుంచి ఒక సింహం కారు దగ్గరికి వచ్చి కారు డోర్‌ తీయడానికి ప్రయత్నించింది. అయితే ఇంతలో వెనుక డోర్‌ దగ్గరకు వచ్చిన సింహం తన పంటితో డోర్‌ లాగే ప్రయత్నంలో అది తెరుచుకుంది. దీంతో లోపల ఉన్న వారు బయపడి టక్కున కారు డోర్‌ను మూయడంతో సింహం అక్కడి నుంచి పక్కకు జరిగింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద నష్టమే జరిగుండేది.
(అబ్బురుపరిచే వర్చువల్‌ నీటి అలలు)

దాదాపు 40 సెకెన్ల నిడివి ఉన్న  వీడియోనూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుషాంత నంద ట్విటర్‌లో షేర్‌ చేశారు. ' కారులో ఉన్న వారితో సింహం కూడా సఫారి రైడ్‌కు వెళ్లాలనుకుందేమో.. అందుకే లిఫ్ట్‌ అడగానికి ప్రయత్నించింది. దయచేసి సఫారి రైడ్‌కు వెళ్లినప్పుడు క్రూర జంతువులతో జాగ్రత్తగా ఉండండి' అంటూ క్యాప్షన్‌ జత చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  వీడియో చూసిన వారంతా 'సింహం చాలా తెలివైనదని.. బతుకు జీవుడా...' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు