నకిలీ వార్తలిచ్చే సైట్లను తొలగిస్తాం: గూగుల్‌

18 Dec, 2017 02:47 IST|Sakshi

న్యూయార్క్‌: తప్పుడు సమాచారాన్ని అందించే వెబ్‌సైట్లపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ కొరడా ఝులిపించింది. నకిలీవార్తలతో పాటు యాజమాన్యం, దాని ముఖ్యోద్దేశం, సొంత దేశం తదితర వివరాలను రహస్యంగా ఉంచే వెబ్‌సైట్లను తమ న్యూస్‌ ఫీడ్‌ నుంచి తొలగిస్తామని గూగుల్‌ హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్‌ ఆదివారం పలు మార్గదర్శకాలు విడుదలచేసింది. ‘మీ గురించి లేదా మీ ఉద్దేశం గురించి తప్పుడు వివరాలు అందజేయవద్దు. మా న్యూస్‌ ఫీడ్‌లో ఉండే సైట్లు వినియోగదారుల్ని తప్పుదారి పట్టించడాన్ని అంగీకరించం’ అని గూగుల్‌ చెప్పింది.

>
మరిన్ని వార్తలు