అంతా భ్రమే.. మీపై అస్సలు ఆధారపడవట

6 Sep, 2015 17:13 IST|Sakshi
అంతా భ్రమే.. మీపై అస్సలు ఆధారపడవట

లండన్: సాధారణంగా పెంపుడు జంతువులను పెంచుకునేవారు తాము లేకుంటే అవి అస్సలు ఉండలేవని అనుకుంటుంటారు. తాముంటే చాలా రక్షణగా ఉంటుందని భావిస్తాయని ఫీలవుతారు. అయితే, అలా అనుకోవడం భ్రమే అవుతుందని, వాస్తవానికి పెంపుడు జంతువులకీ యజమానులపై ఆధారపడే ఉండాలన్న ఆలోచన ఉండదని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ ప్రవర్తన పరిశీలన శాస్త్రవేత్తలు తెలిపారు.

సాధారణంగా కొందరు ఇంట్లో పెద్దవారుంటే భద్రతగా ఉంటుందని, స్నేహితులు ఉంటే భద్రతగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ, ఇలాంటి అంశాలు పెంపుడు జంతువులతో పోల్చినప్పుడుమాత్రం పూర్తి వైవిధ్యం ఉంటుందని చెప్పారు. పిల్లులుగానీ, కుక్కలుగానీ ఎప్పటికప్పుడు స్వయంగా మనగలిగే శక్తిని కలిగిఉంటాయని వారు వివరించారు. ఒకరిపై ఆధారపడి ఉండాలనే ఆలోచనవాటికి ఏమాత్రం ఉండదట.

మరిన్ని వార్తలు