బీపీని కరెక్ట్‌గానే చెక్‌ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా..?

14 Nov, 2023 15:08 IST|Sakshi

ఇప్పుడు ఎవర్నీ కదలించినా బీపీ ఉందని చెబుతుంటారు. నిజానికి అంతమందికి బీపీ ఉందా? కరెక్ట్‌గానే వైద్యులు చెక్‌ చేస్తున్నారా?. అస్సలు బీపీకి ప్రతి రోజు మాత్రలు వేసుకోవాల్సిందేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తదితరాల గురించే ఈ కథనం!.

రక్తపోటు లేదా బీపీ అనేది సర్వసాధారణమైన వ్యాధిలా  అయిపోయింది. దేని గురించి అయినా ఆస్పత్రికి వెళ్తే..ముందుగా బీపీ చెక్‌ చేయడం కామన్‌ కూడా. నిజంగా కరెక్ట్‌గానే చెక్‌ చేస్తున్నారా? అంటే?.  అదంతా అవాస్తమనే చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. ఏటా 10 లక్షల మందికిపైగా అధిక రక్తపోటు ఉందని నిర్థారణ అవుతోంది. కానీ ఇదంతా వాస్తవం కాదని, వేలాది మందికిపైగా బీపీని తప్పుగా నిర్ధారణ అవుతున్నట్లు కొలంబస్‌లోని ఒహియో స్టేట్‌ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొలంబస్‌లోని ఒహియా యూనివర్సిటీ పరిశోధకులు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అండ్‌ అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజిస్ట్‌లతో కలసి జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈ బీపీ పరీక్షలు చాలా తప్పు విధానంలో నిర్వహిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అందుకోసం ఒహియో పరిశోధకులు దాదాపు 150 సముహాల వారిగా పెద్దవాళ్లను తీసుకుని జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. రోగిని ఆమోదయోగ్యమైన కూర్చిలో కూర్చొబెట్టి గుండె స్థానానికి సమాంతర స్థాయిలో చేయిని ఉంచి రీడింగ్‌ని తీసుకోవాలి కానీ అలా జరగడం లేదని పరిశోధనల్లో తేలింది. చాలమంది పేషెంట్లకు తప్పుగా బీపీని రికార్డు చేస్తున్నారని. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ​ పేషెంట్‌కి బీపీ నార్మల్‌గా ఉన్నా..ట్యాబ్లెట్లు ఇస్తే అది అధిక రక్తపోటుకి లేదా వివిధ దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

తమ అధ్యయనంలో చాలామందికి తప్పుగా బీపీని గుర్తించారని, పైగా అధికంగా మందులను కూడా వైద్యులు సూచించినట్లు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. ఈ కారణాల వల్లే యూఎస్‌లో దాదాపు సగం మందికి పైగా పెద్దలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలావరకు బీపీకి మందులను కూడా విపరీతంగా వాడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవచ్చని తెలిపారు పరిశోధకుఉల. తప్పుగా బీపీని రికార్డు చేయడం, దీనికి తోడు మందులను వాడించటం వల్ల చాలమంది ‍ప్రజలు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్నట్ల తెలిపారు. ఇక మందులు బీపీకి అదేపనిగా వాడాల్సిన అవసరం లేదా? విరామం ఇవ్వొచ్చా అంటే? అంతలా అవసరం లేదనే చెబుతున్నాయి అధ్యయనాలు. అంతేగాదు త్వరలో కంటిన్యూగా మందులు వాడాలసిన అవసరం లేకుండానే సరికొత్త ఔషధాన్ని అందుబాటులోకి తేనట్లు కూడా చెప్పుకొచ్చారు.

బీపీకి రోజూ మందులు వేసుకోనక్కర్లేదా?
బీపీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనికి ప్రతిరోజు టెన్షన్‌గా ఓ ట్యాబ్లెట్‌ వేసుకోవాల్సిందే అందరికీ తెసిందే. అందులోనూ హైబీపీ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రోజూకి కనీసం ఒకటి నుంచి రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిందే. కానీ పరిశోధకులు కనిపెట్టిన ఈ కొత్త రకం ఔషధం 'జిలేబేసిరాన్‌' ఆ సమస్యలన్నింటికి చెక్‌ పెడుతుందట. కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు హైబీపీని సమర్ధవంతంగా నియంత్రించడమే గాక ప్రభావంతంగా పనిచేస్తుంది.

దీని వల్ల తరుచుగా మందులు వేసుకోవడం, దాని వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల నుంచి రోగులకు ఉపశమనం లభించినట్లు అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ రక్తపోటు అదుపులో లేకపోతే రోగులు స్ట్రోక్‌, గుండెపోటు లేదా హృదయనాళాలకు సంబంధిత రుగ్మతల బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పేషెంట్లు బీపీ ట్యాబ్లెట్‌న్‌ కంప్లసరీ తమ పక్కనే పెట్టుకుంటుంటారు, టెన్షన్‌గా రోజూ వేసేసుకుంటారు. ఇక ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ సరికొత్త డ్రగ్‌తో. ఇది సమర్థవంతంగా హైబీపి నియంత్రించి సమ స్థాయలో ఉండేలా చేస్తుంది. మనం కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు మాత్రలు లేకుండా గడపొచ్చు. 

(చదవండి: మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకూడదంటే..)

మరిన్ని వార్తలు