ఎన్నోసార్లు అడిగింది కానీ....

6 Mar, 2020 15:04 IST|Sakshi

మాది అందమైన ఊరు. చుట్టూ పచ్చని పొలాలు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కల్మషం లేని మనుషులు. నేను ఇంటర్‌ వరకు మా ఊరిలోనే చదివాను. చాలా హ్యాపీగా గడిచిపోయేది జీవితం. తరువాత బీటెక్‌ చదవడం కోసం నేను హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడ వాళ్లను చూస్తేనే భయమేసేది. ఎవ్వరూ నాలా లేరు. అందరూ చాలా స్టైల్‌గా ఉన్నారు.వాళ్లందరూ మంచి ఇంగ్లీష్‌ మాట్లాడుతూ ఉండేవారు. నేను క్లాస్‌లో జాయిన్‌ అయిన రోజే నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఫస్ట్‌ టైమ్‌ తనని ఎల్లో కలర్‌ డ్రెస్‌లో చూశాను. తన జుట్టు రింగులు రింగులుగా ముఖం మీద పడుతూ ఉండేది. చాలా అందంగా ఉండేది. తనని అలా చూస్తూ ఉండాలనిపించేది. తను రాగానే ఫస్ట్‌ బెంచ్‌లో కూర్చుంది. చాలా సైలెంట్‌గా ఉండేది.అందరు పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటుంటే తన పేరు చందు అని తెలిసింది. తను  ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. తనతో మాట్లాడం ఎలా అని ఆలోచించేవాడిని. క్లాస్‌లో ఎప్పుడు ఏ కార్యక్రమ జరిగిన తను ముందుండేది. ఇంగ్లీష్‌లో టకటక మాట్లాడేది. అది చూస్తేనే నా గుండె దడదడ అనేది. 

తనతో ఎలా అయిన ఫ్రెండ్‌షిప్‌ చేయాలి అని ఆలోచించే సమయంలో తను మా ఫ్రెండ్‌ వాళ్ల లవర్‌ రూమ్‌మేట్‌ అని తెలిసింది. ఇంకా నా లైన్‌ క్లియర్‌ అయ్యింది అనుకున్నాను. మా ఫ్రెండ్‌కు చెబితే కావాలని మేం ఇద్దరం కలిసేలా ప్లాన్‌ చేశారు. మేం కలిసిన తరువాత తను అడిగిన ప్రశ్న విని నేను షాక్‌ అయ్యాను. నువ్వు మా క్లాస్‌యేనా? నిన్ను ఎప్పుడూ చూడలేదే నీ పేరు ఏంటి అని అడిగింది. అప్పుడు నన్ను నేనే ఎన్ని తిట్టుకున్నానో తెలియదు. తరువాత నుంచి రోజు క్లాస్‌లో చూసి నవ్వేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేది. తనకు ఒక బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉండేది. ఆమెతో నాతో మాత్రమే మాట్లాడేది. నా నెంబర్‌, తన నెంబర్‌ పక్కపక్కనే ఎప్పుడు ఎగ్జామ్స్‌ జరిగిన తన వెనకాలే నేను ఉండేవాడిని. తను మాత్రం కొంచెం కూడా కాపీ కొట్టనిచ్చేది కాదు. 

అలా కొన్ని రోజులు గడిచాక నేను,చందు, చందు వాళ్ల ఫ్రెండ్‌ బాగా క్లోజ్‌ అయిపోయాం. రోజు కలిసి క్యాంటీన్‌కి వెళ్లి తిని రచ్చ రచ్చ చేసేవాళ్లం. అందరు మమ్మల్ని చూసి మా లాగా ఉండాలి అనుకునే వాళ్లు. అలాగే చాలా మంది చందు నాకు ఓకే చెప్పేసింది, మేమిద్దరం లవర్స్‌ అనుకునేవాళ్లు. వాళ్ల మాటలన్ని విని తను చాలా సార్లు నేనుంటే నీకిష్టమా? ఎందుకు అందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడిగేది. తను అంటే ఇష్టం ఉన్ననిజం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందో అని అదేం లేదు, చాలా మంది చాలా అనుకుంటారు వదిలేయ్‌ అని చెప్పేవాడ్ని. 

మా ఫైనల్‌ ఇయర్‌లో తనకు మా ప్రేమ విషయం చెబుదాం అనుకున్నాను. కానీ ఇంతలో తను నాకు ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తను వేరు అతనితో ప్రేమలో పడింది అని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడకుండా సరే అని అన్నాను. తరువాత నాకేమైందో తెలియదు ఆరోజు రాత్రి తనని ఫోన్‌ చేసి అసలు నువ్వు వాడిని ఎందుకు లవ్‌ చేశావ్‌. వాడు నీకు సెట్‌ కాడు. మీరు విడిపోతారు అని ఇష్టం వచ్చినట్లు తిట్టేశాను. తనని చాలా బాధ పెట్టాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చాలా సార్లు అడిగాను అప్పుడు ఏం చెప్పలేదు. ఎప్పుడు ఇలా మాట్లాడతావనుకోలేదు అని చెప్పింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. నన్ను చూడలేదు. మా కాలేజ్‌ అయిపోయి నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు తను ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. ఒక్కసారి తనకి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాలనుంది. 
ఇట్లు 
అరవింద్‌కుమార్‌
కరీంనగర్‌

Read latest Lifestyle News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు