-

పుస్తకాలు, కథలు చదివి ప్రేమ గురించి..

23 Nov, 2019 16:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేను 8వ తరగతి చదువుతన్నపుడు మా క్లాస్‌మేట్‌ అమ్మాయిని ఇష్టపడ్డాను. తన పేరు లేఖ! అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఆమెతో కొద్దిసేపైనా గడపాలన్న ఉద్దేశ్యంతో స్కూల్‌ అయిపోయినా కూడా అక్కడే ఉండేవాడ్ని. నేను తనని ప్రేమిస్తున్న సంగతిని ఓ రోజు ధైర్యం చేసి చేప్పేశాను. తనకు అంతకుమందే చాలా మంది ప్రపోజ్‌ చేశారని అందామె. నాకు ప్రేమంటే ఏంటో ఆ వయసులో తెలియకపోయినా.. ఆమెతో మాట్లాడటానికి ఎంతో ఆసక్తి చూపించేవాడిని. బహుశా అది ఆమె పట్ల ఉ‍న్న ఆకర్షణ అనుకుంటా. 8వ తరగతి అయిపోయిన తర్వాత మా కుటుంబం వేరే ఊరికి మారాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాన్న ఉద్యోగం కారణంగా తరుచూ ఊర్లు మారాల్సి ఉండేది.

ఊరు మారినా నేను తనను మర్చిపోలేదు. ఎనిమిదేళ్ల తర్వాత తనను నేను ఫేస్‌బుక్‌లో కలిశాను. అప్పుడు తను చాలా పెద్ద పొజిషన్‌లో ఉంది. కానీ, నేను ఏదో చిన్న జాబ్‌ చేసుకునే వాడిని. ఇన్నేళ్లలో ఆమెలో చాలా మార్పు వచ్చింది. మా పాత జ్ఞాపకాల గురించి తనను ప్రశ్నించాను. తనకేమీ గుర్తులేనట్లు మాట్లాడింది! తను ఇప్పుడు పెద్ద పొజిషన్‌లో ఉందన్న ఒకే ఒక్క కారణంతో. అయినా నేను తనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. చాలా పుస్తకాలు, కథలు చదివి ప్రేమ గురించి నేనేమి తెలుసుకున్నానంటే.. ప్రేమ దైవ సమానమైనదని. లవ్‌ యూ ఫరెవర్‌ లేఖ!
- పవన్‌
చదవండి : 
చెస్‌ ఛాంపియన్‌కు ప్రేమ పరీక్ష
టీచర్‌ కారణంగా మేము విడిపోయాం


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

మరిన్ని వార్తలు