పన్నెండు కోట్లయితేనే!

6 Jul, 2017 23:57 IST|Sakshi
పన్నెండు కోట్లయితేనే!

దీపికా పదుకొనెను హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే పారితోషికం 12 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా! అని కండీషన్‌ పెడుతున్నారట. దీపిక ఇంత డిమాండ్‌ చేయడానికి కారణం సంజయ్‌ లీలా బన్సాలీ డైరెక్షన్‌లో చేస్తోన్న ‘పద్మావతి’ అని టాక్‌. ఈ సినిమా కోసం ఏకంగా 200కిపైగా డేట్స్‌ ఇచ్చారట.

అందుకుగాను 12 కోట్లు పుచ్చుకున్నారని భోగట్టా. అయితే, కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే తదుపరి చేయనున్న సినిమాలకు కూడా 12 కోట్లు తీసుకోవాల్సిందేనని ఫిక్స్‌ అయ్యారట. కానీ, నిర్మాతలు మాత్రం దీపికాకు అంత ఇవ్వడానికి ఫిక్స్‌ అవ్వడంలేదని సమాచారం. దాంతో బ్యూటీ మునగచెట్టు దిగక తప్పదని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.