గుడ్డిగా నమ్మేయాలి!

23 Nov, 2018 05:40 IST|Sakshi
కాజల్‌ అగర్వాల్‌

మీక్కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలుండాలి అని అమ్మాయిలను అడిగితే చాంతాడంత లిస్ట్‌ ఉంటుంది. అందంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, బాగా చూసుకోవాలి.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టడం కష్టం. మరి ‘మీ మనసుకి దగ్గరవ్వాలంటే ఆ వ్యక్తిలో ఏయే క్వాలిటీస్‌ ఉండాలి?’ అని హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ని అడిగితే... ‘‘హృదయానికి సంబంధించిన ప్రేమ, అనుబంధాల గురించి ఇలా చటుక్కున చిటికెలో చెప్పేయడం కష్టం. అయినా చెబుతాను. నా నిజాయతీని గౌరవించేలా అతను నన్ను గుడ్డిగా నమ్మేయాలి. నేనూ నమ్ముతాను.

అతనికి ఫస్ట్‌ ప్రియారిటీ నేనే అవ్వాలి. నా మాటల్లోని అమాయకత్వాన్ని ఎంజాయ్‌ చేయాలి. ఎప్పుడూ నవ్విస్తుండాలి. ఇంటి పనుల్లో సాయంగా ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. ఇక కాజల్‌ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో, శ్రీనివాస్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ‘కవచం’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఆమె నటించిన హిందీ హిట్‌ ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్లో రూపొందనున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో కాజల్‌నే కథానాయిక అని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు