రూ 100 కోట్లిస్తే అలా చేస్తావా..

1 Nov, 2018 19:36 IST|Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు బ్రేక్‌ పడటం లేదు. పలువురు మహిళలు సాజిద్‌ ఖాన్‌ వేధింపులపై బాహాటంగా ముందుకు రాగా, తాజాగా మరో నటి అహానా కుమ్రా సాజిద్‌ ఆగడాలను వెల్లడించారు. సాజిద్‌ వ్యవహారం తెలిసినప్పటికీ గత ఏడాది తాను ఆయనను సాజిద్‌ నివాసంలో కలిశానని ఆమె చెప్పారు. లైట్లు లేని గదిలోకి తనను తీసుకువెళ్లగా బయట కూర్చుందామని కోరగా, అక్కడ తన తల్లి ఉన్నారని ఆమెకు అసౌకర్యం కలిగించడం తనకు ఇష్టం లేదని సాజిద్‌ చెప్పాడన్నారు.

సాజిద్‌ సరిగ్గా ప్రవర్తించాలని ఆశిస్తూ తన తల్లి పోలీస్‌ అధికారి అని చెప్పానన్నారు. అలా చెప్పినా జుగుప్ప కలిగించేలా సంభాషణ ప్రారంభించాడని చెప్పుకొచ్చారు. తాను రూ 100 కోట్లిస్తే శునకంతో లైంగిక చర్యకు పాల్పడతారా అని సాజిద్‌ అడిగారన్నారు. ఆయన వేసే జుగుప్సాకర జోక్‌లకు తాను నవ్వాలని సాజిద్‌ ఆశిస్తున్నట్టు గ్రహించానన్నారు. సాజిద్‌పై ఇప్పటికే పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో హౌస్‌ఫుల్‌ 4 మూవీ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సాజిద్‌పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్‌, మందనా కరిమి, రేచల్‌ వైట్‌ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు