‘అప్పుడు ఇరా.. ఇప్పుడు ఆమిర్‌!‌’

1 Jul, 2020 11:48 IST|Sakshi

ముంబై: ఆన్‌లైన్‌లో సీరియస్‌గా ఫిట్‌నెస్‌ క్లాస్ వింటున్న కూతురు ఇరాను బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక‌్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ మధ్యలో వచ్చి డిస్టర్బ్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. త్వరలో వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్న ఇరా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. ఇందుకోసం ధూమ్‌, పీకే సినిమాలకు ఆమిర్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరించిన డేవిడ్‌ పోజ్నిక్‌ వద్దనే ఇరా శిక్షణ తీసుకుంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌ డేవిడ్‌ సమక్షంలో సీరియస్‌గా కసరత్తు చేస్తున్న ఇరాను ఆమిర్‌ మధ్యలో వచ్చి ఆటంకం కలిగించిన లైవ్‌ వీడియోను డేవిడ్‌ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. (వాళ్లకు పాజిటివ్‌.. మాకు నెగెటివ్‌)

Join us for a fun home workout with Ira Khan during lockdown! Back when I was training Aamir for Dhoom 3 and PK, Ira used to hang out with us a lot, but would basically run away when I tried to get her to work out! Many years have passed, and now we're diving into weekly workouts with plenty of pushups, squat variations, and some fun with feet in the air. This session also included a fun surprise hello from Aamir. But now the tables have turned - Ira was rocking the workout and Aamir just popped in to say hi! You can follow along with this workout, and be sure to stay tuned for more live workouts coming soon!

A post shared by Poznic Training (@poznictraining) on

ఈ వీడియోలో ఆమిర్‌ను ‘రండి మీరు కూడా మాతో పాల్గొనండి సార్’ అని డేవిడ్‌ అడగ్గా.. ‘లేదు నేను మీకు హాయ్‌ చెప్పాడానికే వచ్చాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. దీనికి డేవిడ్‌ ‘గతంలో ఆమిర్‌తో పని చేసినప్పుడు ఇరా వచ్చి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేది. మమ్మల్ని డిస్టర్బ్‌ చేసేది. ఇప్పుడు ఇరా సీరియస్‌గా కసరత్తు‌ చేస్తుంటే ఆమిర్‌ తనని డిస్టర్బ్‌‌ చేశాడు’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆమిర్‌ ఇంటిలో పనిచేసే సిబ్బందికి కరోనా వచ్చిన వచ్చిన విషయం తెలిసిందే. తమ కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్‌ వచ్చినట్లు ఆమిర్‌ ఖాన్‌ తెలిపాడు. (కరోనా : ఆమీర్ ఖాన్ కీలక ప్రకటన)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా