‘ఇప్పుడు షారూఖ్‌ స్థాయి లుంగీ డాన్స్‌కి దిగజారింది’

2 Oct, 2018 18:39 IST|Sakshi

చాలా కాలం పాటు తన గాత్రంతో బాలీవుడ్‌ జనాలను ఊర్రూతలూగించాడు ప్లేబాక్‌ సింగర్‌ అభిజిత్‌ భట్టాచార్య. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానముందని చెప్పుకొనే అభిజిత్‌... షారూఖ్‌ ఖాన్‌కు.. ‘ఛల్తే ఛల్తే’.,  ‘మై కోయీ ఐసా గీత్‌ గావూన్‌’  వంటి సాంగ్స్‌తో హిట్ల మీద హిట్లు ఇచ్చాడు. అయితే గత కొంత కాలంగా షారూఖ్‌కు పాడటం మానేశాడు అభిజిత్‌. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఎన్నోసార్లు మాటల యుద్ధం కూడా కొనసాగింది.

అయితే తాజాగా మరోసారి షారూఖ్‌పై విరుచుకుపడ్డాడు అభిజిత్‌. గాంధీ జయంతి సందర్భంగా ఇండియా టుడే సఫాయిగిరీ కార్యక్రమంలో పాల్గొన్న షారూఖ్‌కి పాడటం మానేయడం వెనుక గల కారణాలను వెల్లడించాడు. ‘నా వాయిస్‌తో ఎంతో మందిని సూపర్‌ స్టార్లను చేశాను. నేను షారూఖ్‌కి పాడినంత కాలం అతడు రాక్‌స్టార్‌గా పేరొందాడు. కానీ నేనెప్పుడైతే తనకి పాడటం మానేశానో లుంగి డాన్స్‌కి తన స్థాయి పడిపోయింది’ అంటూ షారూఖ్‌ను ఘాటుగా విమర్శించాడు.

అసలు కారణం అదే..
‘మై హూనా సినిమా ఎండింగ్‌లో స్పాట్‌ బాయ్‌ మొదలుకొని ప్రొడ్యూసర్‌ వరకు ప్రతి ఒక్కరిని స్క్రీన్‌పై చూపించారు. కానీ సింగర్స్‌కు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. అలాగే ఓం శాంతి ఓం సినిమాలో కూడా. అందులో ధూమ్‌ తనా సాంగ్‌కి నా గాత్రం అరువిచ్చాను. అందుకు ప్రతిగా నాకు దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కలేదు. ఆత్మాభిమానం దెబ్బతిన్నది కాబట్టే అతడికి పాడటం మానేశాను’ అంటూ అసలు కారణాన్ని బయటపెట్టారు అభిజిత్‌.

మరిన్ని వార్తలు