సమస్యాత్మక కథతో కంగనా

9 Jun, 2020 08:31 IST|Sakshi

సంచలన నటిగా పేరుగాంచిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తరచూ ఏదో అంశంతో వార్తల్లో కెక్కే ఈ బ్యూటీ తాజాగా మరోసారి ప్రైమ్‌ టైంలోకి వచ్చింది. ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు పొందిన నటీ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మడు తమిళ్‌ చిత్ర పరిశ్రమలోకి ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత తాజాగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్‌ పాత్ర పోషిస్తోంది. తేజ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇది తమిళంతో పాటు తెలుగు, హిందీ తదితర భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోంది.

నటి కంగనా రనౌత్‌ తాజాగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికే తాను నటించిన మణికర్ణిక చిత్రానికి సగ భాగం వరకు దర్శకత్వం వహించి ఆ శాఖలను తానేమిటో నిరూపించుకున్నారు.  ఆమె నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారాన్నది తాజా సమాచారం. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన రామ మందిరం కేసు ఇతివృత్తంతో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అపరాజిత అయోధ్య అనే టైటిల్‌ కూడా నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై నటి కంగనా రనౌత్‌ మాట్లాడుతూ అవును తాను స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. చదవండి: అజయ్‌ దేవగన్‌కి జోడీగా శ్రియ

ఇది వివాదాస్పద ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం కాదన్నారు. ఇందులో ప్రేమ, నమ్మకం, ఐక్యత వంటి పలు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఇది దైవం ఇతివృత్తంతో కూడినదన్నారు. దీనికి తాను దర్శకత్వం వహించాలని అనుకోలేదని, వేగ దర్శకుడితో చిత్రం చేయాలని భావించానని అన్నారు. తే.గీ ఇది కూడా మణికరి్ణక చిత్రం తరహాలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రం అని చెప్పారు. తానే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని తన భాగస్వాములు భావించారని, ఆ విధంగా తాను ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను వహిస్తున్నట్టు ప్రకటించారు. కోలాటం పూర్తయిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. మరో విషయం ఏంటంటే ఈ చిత్రంలో నటి కంగనా రనౌత్‌ నటించడం లేదట. చదవండి: కన్నీటిపర్యంతమైన అర్జున్

మరిన్ని వార్తలు