ఆయన దర్శకత్వంలో నటిస్తా!

7 Feb, 2020 11:48 IST|Sakshi

సినిమా: నటుడు ధనుష్‌ దర్శకత్వంలో నటించడం ఖాయం అంటోంది నటి అదితిరావ్‌. మణిరత్నం చిత్రాలతో పాపులర్‌ అయిన నటి ఈ భామ. కార్తీ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన కాట్రు వెలియిడై చిత్రంలో నటించిన అదితిరావ్‌ తాజాగా ఆయన దర్శకత్వంలోనే పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా తుగ్లక్‌ దర్బార్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇక హిందీ, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఒక్కో చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు ఉదయనిది స్టాలిన్‌కు జంటగా నటించిన సైకో చి త్రం ఇటీవల తెరపైకి వచ్చింది. కాగా ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటించే చిత్రంలో అదితిరావ్‌ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం 2018లోనే జరిగింది. అయి తే ఆ చిత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఈ మధ్యలో ధనుష్‌ అసురన్, పటాస్‌ చిత్రాల్లో నటించేశారు.  ప్రస్తుతం సురళి, కర్ణన్‌ చిత్రాలతో పాటు కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.

దీంతో అంతకు ముందు స్వీయ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించిన చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అసలు ఆ ప్రాజెక్ట్‌ ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదితిరావ్‌ పేర్కొంటూ తాను  ధనుష్‌ దర్శకత్వంలో కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అది జరిగి తీరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అంత నమ్మకం ఏమిటమ్మా అన్న ప్రశ్నకు తన మనసు చెబుతోందని, అది ఎప్పు డూ సరిగానే చెబుతుందని అంది. ధనుష్‌ నటుడు మాత్రమే కాకుండా దర్శకుడు కూడా కా వడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. నటుడు ధనుష్‌ ప్రతిభావంతుడైన దర్శకుడని, తన నటించడంతో పాటు ఇతరుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దిట్ట అని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసింది. ఈ అమ్మడు ఎందుకిలా ధనుష్‌ను పొగుడుతుందో అర్థంకాక నెటిజన్లు అందుకు కారణాలను వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అదితిరావ్‌ ప్రస్తుతం విజ య్‌సేతుపతికి జంటగా నటిస్తున్న తుగ్లక్‌ దర్బార్‌ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకుందట. ఎందుకంటే మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. అది భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చారిత్రక కథా చిత్రం కాబట్టి. ఈ రెండూ మినహా కోలీవుడ్‌లో ఈ జాణకు అవకాశాలు లేవు. విజయ్‌సేతుపతితో నటిస్తున్న తుగ్లక్‌ దర్బార్‌ విడుదలైతే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు