తనయుల పెళ్లిపై నాగార్జున తాజామాట

5 Sep, 2016 18:25 IST|Sakshi
తనయుల పెళ్లిపై నాగార్జున తాజామాట

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. నాగార్జున తన ఇద్దరు తనయులు, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ల వివాహంపై మరోసారి స్పందించారు. నాగచైతన్య, అఖిల్ వివాహాలపై త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు. మంచి ముహూర్తం చేసుకుని వివరాలు తెలియజేస్తామని నాగార్జున తెలిపారు.

నాగ  చైతన్య, అఖిల్  ఇద్దరూ వారి  జీవిత బాగస్వాములను ఎన్నుకోవడం తనకు, సతీమణి అమలకు చాలా సంతోషంగా ఉందని ఇటీవల నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. తన కుటుంబంలో రెండు పెళ్లిళ్లు ఉంటాయంటూ చెప్పారు. నాగ చైతన్య, ఓ ప్రముఖ హీరోయిన్ ప్రేమించుకున్నారని, అఖిల్ ... ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.