బన్నీ ఆగట్లేదుగా.. వచ్చే నెలలో

16 Jan, 2020 16:16 IST|Sakshi

సంక్రాంతి బరిలో నిలిచిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఘన విజయం సాధించి సత్తా చాటింది. దీంతో అదే జోష్‌లో బన్నీ మరో హిట్‌ కోసం వేట మొదలు పెట్టాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి బన్నీ తన 20వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు ఎంత హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీరు ముచ్చటగా మూడోసారి జత కడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పైగా సుకుమార్‌ గత చిత్రం ‘రంగస్థలం’తో టాలీవుడ్‌కు ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించడంతో దాన్ని కొనసాగిస్తాడని బన్నీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాలో బన్నీ సరసన క్యూట్‌ అండ్‌ స్వీట్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా నటిస్తోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. గీతాఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా కథ సాగుతుందని సమాచారం. ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో బన్నీయేతర షూటింగ్‌ను జరుపుతున్నారు. ఇక వచ్చే నెల ప్రారంభం నుంచి బన్నీ రెగ్యులర్‌ షూటింగ్‌కు హాజరుకానున్నాడు. ఇందులో బన్నీ యాస, వేషధారణ కూడా సరికొత్తగా అభిమానులకు నచ్చేలా ఉంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా సుకుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: రాములమ్మ మళ్లీ ఏడిపించింది అంటున్నారు

అల్లువారి జీవితాలు ప్రేక్షకులకు అంకితం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా