Anchor Suma: యాంకర్‌ సుమ ప్రశ్నలు.. కౌంటర్లిచ్చిన హీరో.. పరువు పాయే..

17 Nov, 2023 15:22 IST|Sakshi

ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ఓ అద్భుతమైన ప్రేమకథతో వచ్చిన సినిమా సప్తసాగరాలు దాటి. సెప్టెంబర్‌లో రిలీజైన ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ కాగా తాజాగా రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్‌ బిగా విడుదలైంది. ఇందులో హీరో రక్షిత్‌ శెట్టి, హీరోయిన్లు రుక్మిణి, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందు వీరు ముగ్గురూ యాంకర్‌ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

హీరో కౌంటర్లు.. కవరింగ్‌ చేసే పనిలో సుమ
సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే.. అందులో ఏమాత్రం డౌట్‌ లేదు. కానీ సుమ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. 'సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ, సైడ్‌ బి.. కథలు ముందే రాసుకున్నారా?' అని హీరోను అడగ్గా కథ రాసింది నేను కాదు, హేమంత్‌ అని క్లారిటీ ఇచ్చాడు రక్షిత్‌ శెట్టి. 'రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా తీద్దామా? అని ఓరోజు హేమంత్‌ అడిగాడు. రెండు భాగాలుగా తీస్తే బాగుంటుంది అని చెప్పాను. అలా సైడ్‌ ఎ, సైడ్‌ బిగా తీశాం' అని వివరణ ఇచ్చాడు. మరి దీనికి నిర్మాత ఒప్పుకున్నాడా? అని సుమ ప్రశ్నించగా నేనే నిర్మాతను అని పంచ్‌ ఇచ్చాడు రక్షిత్‌.

నాలుక్కరుచుకున్న సుమ
మీరు హీరో, డైరెక్టర్‌, నిర్మాత, సింగర్‌ అని వర్ణించుకుంటూ పోవడంతో రక్షిత్‌ శెట్టి తాను సింగర్‌ కాదని చెప్పాడు. అటు సినిమా గురించి, ఇటు హీరో రక్షిత్‌ శెట్టి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసి సుమ నాలుక్కరుచుకుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు.. 'ఏంటి సుమ.. ఎంతో అనుభవం ఉన్నదానివి, ఇలా చేశావేంటి? ముందే ప్రిపేర్‌ అవ్వాల్సింది. అనవసరంగా వాళ్ల ముందు పరువు తీసుకున్నావ్‌' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం 'తనదసలే బిజీ షెడ్యూల్‌.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సాధారణమే' అని వెనకేసుకొస్తున్నారు.

చదవండి:  21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్‌.. చనిపోదామనుకున్నా..

మరిన్ని వార్తలు