నిర్భయ కేసు : దోషుల ఉరిపై స్టే

16 Jan, 2020 16:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం నెలకొంది.  ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ నెల 22న వారి ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు గురువారం నిలిపివేసింది. వారికి డెత్‌ వారెంట్‌ ఇస్తూ తాను జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించడం లేదని, క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటంతో వారి ఉరి శిక్ష అమలుపై స్టే విధిస్తున్నామని తీస్‌ హజారి కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుపై పూర్తి నివేదికను రేపటిలోగా ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు.

కాగా, రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున నిర్భయ దోషులను తాము ఈనెల 22న ఉరితీయడం లేదని అంతకుముందు తీహార్‌ జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. కాగా నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈనెల 22న వారి ఉరిశిక్ష నిలిచిపోయిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో​నలుగరు దోషులు ముఖేష్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తాలను జనవరి 22న ఉరి తీయాలని ఈనెల 7న ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి : నిర్భయ కేసులో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేను కేవలం రబ్బర్‌ స్టాంప్‌ను కాదు..

అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్‌

తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం

ప్రజాపోరులో ఐఏఎస్‌ అధికారి

సీఏఏపై సుప్రీం కోర్టు ఎలా విచారిస్తుంది?

సినిమా

బన్నీ ఆగట్లేదుగా.. వచ్చే నెలలో

వెలకట్టలేని ఙ్ఞాపకాలు: ఉపాసన

ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్‌

ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు

మై డియర్‌ శర్వా.. థాంక్యూ: అల్లు అర్జున్‌

అనుష్కను ఆటపట్టించిన హీరో!

-->