ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది

24 Mar, 2014 00:47 IST|Sakshi
ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది

కొన్ని బాధలు జీవితాంతం వెంటాడతాయి. అలా అమితాబ్ బచ్చన్‌ని ఎప్పటికీ వెంటాడే బాధ ఒకటుంది. ఇటీవల ఓ సందర్భంలో దాని గురించి ఈ బిగ్ బి చెబుతూ- ‘‘పిల్లల ఎదుగుదలను చూడటం ఏ తల్లీతండ్రికైనా ఓ వరం లాంటిది. కానీ, నా పని ఒత్తిడి వల్ల ఆ అనుభూతిని ఆస్వాదించలేకపోయాను.
 
  శ్వేత, అభిషేక్‌ల బాల్యం ఎలా గడిచిందో? ఎలా పెరిగారో నాకు సరిగ్గా తెలియదు. నేను షూటింగ్ ముగించుకుని, ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ నిద్రపోతూ కనిపించేవాళ్లు. వాళ్లు మేల్కొనే సరికి నేను వెళ్లిపోవడమో, లేక నేను మేల్కొనక ముందే వాళ్లు స్కూల్‌కి వెళ్లడమో జరిగేది. నేనంత బిజీగా సినిమాలు చేసేవాణ్ణి. నేను కొంచెం పని ఒత్తిడి తగ్గించుకున్న తర్వాత కూడా నా పిల్లలతో గడిపే వీలు చిక్కలేదు. ఎందుకంటే, వాళ్లిద్దరూ హాస్టల్‌లో ఉండేవాళ్లు. ఇవాళ నేనింత పేరు, డబ్బు సంపాదించుకున్నా, నా పిల్లల ఎదుగుదలను సరిగ్గా చూడలేకపోయాననే బాధ మాత్రం ఉంది’’ అని చెప్పారు.
 

>