రాజ్‌కుమార్‌కు అమితాబ్‌ అభిమాని

13 Sep, 2018 11:38 IST|Sakshi

అభిషేక్‌ బచ్చన్‌  

యశవంతపుర: దివంగత నటుడు రాజ్‌కుమార్‌కు తన తండ్రి అభిమాని అని ప్రఖ్యాత బాలీవుడ్‌ హీరో అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ అన్నారు. ఆయన బుధవారం తను నటించిన కొత్త సినిమా మన్‌ మర్జియా సినిమా ప్రచారం కోసం బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా కన్నడ కంఠీరవ– అమితాబ్‌ల మధ్యనున్న అనుబంధాన్ని అభిషేక్‌ జ్ఞాపకం చేసుకున్నారు. తన తండ్రి అమితాబ్‌ రాజ్‌కుమార్‌ అభిమాని, ఆయనంటే మాకు కూడా ఎంతో గౌరవం ఉందన్నారు. తను కూడా రాజ్‌కుమార్‌కు అభిమానినని తెలిపారు. దక్షిణాదిలో కూడా మంచి సినిమాలు విడుదలవుతున్నట్లు చెప్పారు. రాజ్‌కుమార్‌ హిందీ సినిమాలలో నటించి ఉంటే తనకు ఇన్ని సినిమాలో నటించే అవకాశం వచ్చేవి కాదని అమితాబ్‌ చెప్పేవారని అన్నారు. 

మరిన్ని వార్తలు