అ..ఆ.. భామకు మరో గోల్డెన్ ఛాన్స్

26 Jun, 2016 21:13 IST|Sakshi
అ..ఆ.. భామకు మరో గోల్డెన్ ఛాన్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ కాంబినేషన్లో తెరకెక్కిన అ ఆ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన మళయాల బ్యూటి అనుపమా పరమేశ్వరన్. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్లో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ మల్లూ బ్యూటి. అయితే రెండో సినిమా ఇంకా రిలీజ్ కూడా కాక ముందే మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో సతీష్ వేగేశ్న దర్శకుడిగా తెరకెక్కుతున్న శతమానం భవతి సినిమా కోసం అనుపమను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాతో శర్వానంద్ సరసన హీరోయిన్గా నటిస్తోంది ఈ భామ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.