ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

7 Nov, 2019 07:45 IST|Sakshi

సినిమా: ఎప్పుడో అనుకున్న కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా? అందుకు అవకాశం ఉందంటున్నారు సీనీ వర్గాలు. ముందుగా అందాల నటి అనుష్క గురించి చెప్పాలి. ఈ స్వీటీ దాదాపు రెండేళ్లకు పైగా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డిలో ఝాన్సీరాణిగా మెరిసి తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాజాగా నటిస్తున్న సైలెన్స్‌ (తెలుగులో నిశ్శబ్దం) చిత్రం చిత్ర ప్రచారం మొదలైంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లిష్‌  భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. చిత్ర టీజర్‌ బుధవారం విడుదలైంది. చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అనుష్క నెక్ట్స్‌ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుంది. ఈ విషయాన్ని అటుంచితే మరో సంచలన దర్శకుడు గౌతమ్‌మీనన్‌. ఈయన ఈ మధ్య నటుడిగా కూడా మారారు.

దర్శకుడిగా చేసిన చిత్రాలే తెరపైకి వచ్చి చాలా కాలమైంది, అయితే ధ్రువనక్షత్రం, ఎన్నై నోక్కి పాయుమ్‌ తూటా చిత్రాలు చాలా కాలంగా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ధనుష్‌ మేఘాఆకాశ్‌ జంటగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్‌ తూటా చిత్రం విడుదల తేదీలు రెండు మూడు సార్లు వాయిదా పడ్డా, ఈ సారి పక్కాగా రావడానికి రెడీ అవుతోంది. దీన్ని నిర్మాత ఐసరిగణేశ్‌ తన చేతుల్లోకి తీసుకుని ఈ నెల 29వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదే నిర్మాత దర్శకుడు గౌతమ్‌మీనన్‌తో వరుసగా రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. అందులో ఒకటి  జోష్వా ఇమై పొయ్‌ ఖాఖా. ఇందులో వరుణ్‌రాహెల్‌ జంటగా నటించనున్నట్లు తెలిసింది. ఇక రెండవ చిత్రంలో నటి అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందట. కాగా నటి అనుష్క భాగమతి చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చెన్నైకి వచ్చినప్పుడు తాను తదుపరి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి కమిట్‌ అయినట్లు వెల్లడించింది. అయితే ఆ తరువాత ఆ చిత్రం ఊసే లేదు. సైలెన్స్‌ చిత్రాన్ని పూర్తి చేసిన అనుష్కకు ఇన్నాళ్లకు అప్పుడు కమిట్‌ అయిన గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి సెట్‌ అవుతుందా అన్న ఆసక్తి నెలకొంంది. ఈ çచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...

మళ్లీ మళ్లీ రాని అవకాశం

సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను

కనెక్ట్‌ అయిపోతారు

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమో

తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్‌

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’

అభిమానిని తోసిపారేసిన రణు మొండాల్‌

‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి