అమ్మో నన్ను కాల్చకు కత్రినా!

13 Sep, 2019 17:19 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో అర్జున్‌కపూర్‌ సోషల్‌ మీడియాల్లో సెలబ్రెటీలు పోస్ట్‌ చేసే ఫోటోలకు, వారి పోస్టులకు ఫన్నీ కామెంట్స్‌ పెట్టి ఆటపట్టిస్తుంటాడు. అలా అర్జున్‌ సామాజిక మాధ్యమాల కామెంట్‌ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌  కత్రినా కైఫ్‌ ఫోటోలకు కామెంట్‌ పెట్టి మరోసారి ఉడికించాడు.

కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. కాఫీ మగ్‌ ఎమోజీని పోస్ట్‌ చేసింది. దానికి అర్జున్‌ ‘కత్రినా ఈ ఫోటోకి ఎమోజీకి సంబంధం లేదు.. తఖ్త్‌లో నీతో కాఫీకి కరణ్‌ను పరోక్షంగా ఆహ్వానిస్తున్నావా?’ అంటూ కామెంట్‌ పెట్టాడు. దీనికి కత్రినా స్పందిస్తూ.. ‘అర్జున్‌.. ఎవరైనా కాఫీ తాగేటప్పుడు వారి బాడీ లాంగ్వేజ్‌ ఇలానే ఉంటుంది’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో  తన కామెంట్‌తో కత్రినా బాధపడి ఉంటుందని భావించి.. ‘బై ద వే నేను జోక్‌ చేశాను అంతే.. తర్వాత నన్ను కాల్చోద్దు ప్లీజ్‌..’ అంటూ  మరో కామెంట్‌  పెట్టాడు. 

అయితే వీరిద్దరు ఇలా ఘర్షణ పడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కత్రినా తన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంట్లో కత్రినా కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకుని ఉండటంతో.. గ్లాస్‌ను డే టైమ్‌లో పెట్టుకోవాలి.. నైట్‌  టైం లో  కాదంటూ సోషల్‌ మీడియా వేదికగా అర్జున్‌ ఆటపట్టించాడు. ప్రస్తుతం కత్రినా కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న తఖ్త్‌ సినిమాలో నటిస్తోంది.

☕️

A post shared by Katrina Kaif (@katrinakaif) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు