వాయిదా పడిన ప్రతిసారీ హిట్టే

24 Mar, 2019 00:30 IST|Sakshi
రాజ్‌కుమార్, నిఖిల్, ‘ఠాగూర్‌’ మధు

– నిఖిల్‌

నిఖిల్‌ సిద్ధార్థ్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌ పి అండ్‌ ఔరా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేశారు. మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం చిత్రబృందం ప్రెస్‌మీట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ– ‘‘హ్యాపీడేస్‌’ నుండి ‘అర్జున్‌ సురంవరం’ వరకు 16 చిత్రాలు చేశాను.

అన్ని సినిమాల్లోకి ఈ చాలా బాధ్యత గల సినిమా ఇది. టాప్‌ రిపోర్టర్‌ అవ్వాలనుకునే అర్జున్‌ క్యారెక్టర్‌ని ఈ చిత్రంలో ప్లే చేస్తున్నాను. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, పడగొట్టాలన్నా మీడియాకి పవర్‌ ఉంటుంది. మీడియాలో ఉన్న పాజిటివ్, నెగిటివ్‌ అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నా కెరీర్‌లోనే మోస్ట్‌ రెస్పాన్సిబుల్‌గా ఫీలై ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా అంతా కంప్లీట్‌ అయ్యింది. ఇప్పుడు మే 1న రిలీజ్‌ చేస్తున్నాం.

నైజామ్‌ ఏషియన్‌ సునీల్‌ విడుదల చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్‌. నా సినిమాలు పోస్ట్‌పోన్‌ అయిన ప్రతిసారీ హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్‌ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువైనా సినిమా బాగా రావడానికి నిర్మాతలు ‘ఠాగూర్‌’ మధు, రాజ్‌కుమార్‌ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు. నిర్మాత రాజ్‌కుమార్‌ ఆకెళ్ల మాట్లాడుతూ – ‘‘సినిమా బాగుండాలని కాంప్రమైజ్‌ కాకుండా చేశాం. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.  ఇప్పుడు ఎన్నికల జోరు ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌  సలహా మేరకు మే 1న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు ‘ఠాగూర్‌’ మధు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది