దర్శకుడి ప్రేమ

7 Jun, 2017 02:44 IST|Sakshi
దర్శకుడి ప్రేమ

వెండితెరపై మాంచి ప్రేమకథను ప్రేక్షకులకు చూపించాలనుకున్న ఓ సెల్ఫిష్‌ దర్శకుడు తెర వెనక ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అప్పుడేం జరిగింది? ప్రేమకు, తపనకు మధ్య ఆ దర్శకుడు ఎలా నలిగాడు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘దర్శకుడు’. ‘కుమారి 21 ఎఫ్‌’ హిట్‌ తర్వాత సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ నిర్మిస్తున్న చిత్రమిది.

హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇటీవల ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. అశోక్‌ నటన, హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ స్పీడుగా జరుగుతున్నాయి’’ అన్నారు. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ అనుమోలు, కూర్పు: నవీన్‌ నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేశ్‌ కోలా.