‘బాగీ-2’: బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల తుఫాన్‌!

2 Apr, 2018 14:38 IST|Sakshi

సాక్షి, ముంబయి : టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్‌ వద్ద మోతమోగిస్తోంది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతూ 2018లో రెండో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు, రెండో రోజు రూ 20.40 కోట్లు వసూలు చేసిన బాగీ 2.. వీకెండ్‌ చివరి రోజైన ఆదివారం ఏకంగా రూ. 27.60 కోట్లు రాబట్టింది. మొత్తానికి మొదటి వారాంతంలో ఈ సినిమా రూ. 73.13 కోట్లు వసూలు చేసింది.

‘ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌..ప్రతిచోటా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ వసూళ్లతో దూసుకెళుతోంది. అసాధారణమైన ఓపెనింగ్‌ వసూళ్లు సాధించింది... మొత్తం రూ. 73.10 కోట్లు రాబట్టింది’ అని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరన్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. 2018లో బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్‌ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ‘బాగీ-2’  రెండోస్థానంలో నిలిచిందని, భన్సాలీ ‘పద్మావత్’ సినిమా రూ. 114 కోట్లతో మొదటిస్థానంలో ఉందని ఆయన తెలిపారు. అయితే, ‘పద్మావత్‌’  సినిమా హిందీతోపాటు తమిళం, తెలుగు భాషలను కలుపుకొని ఈ మొత్తం కలెక్షన్లు రాబట్టిందని పేర్కొన్నారు. 2018 టాప్‌-5 ఓపెనింగ్‌ వసూళ్ల జాబితాలో రైడ్‌ (రూ. 41.01 కోట్లతో) మూడోస్థానంలో, పాడ్‌మ్యాన్‌ (రూ. 40.05 కోట్లతో) నాలుగో స్థానంలో, సోను కే టిటు కి స్వీటీ (రూ. 26.57 కోట్లతో) ఐదోస్థానంలో ఉందని తెలిపారు.

తెలుగులో వచ్చిన ‘క్షణం’సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘బాగీ-2’లో టైగర్‌ ష్రాఫ్‌ చేసిన రిస్కీ ఫైట్లు, అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టైగర్‌ను ప్రశంసిస్తూ.. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్లు అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌లు ట్వీట్‌ చేశారు. ​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా