బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె: ఫస్ట్‌ ఎలిమినేషన్‌ అతడే!

3 Nov, 2019 19:31 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తుది అంకానికి చేరుకుంది. మూడో సీజన్‌ విజేత ఎవరో మరికాసేపట్లో తేలనుంది. మా టీవీలో ప్రస్తుతం బిగ్‌బాస్‌ -3 గేమ్‌ షో గ్రాండ్‌ ఫినాలె ప్రసారం అవుతోంది. ఈ షోలో భాగంగా గ్రాండ్‌ ఫినాలె నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటుడు అలీ రెజా నిలిచారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అతిథులుగా వెళ్లి సందడి చేసిన మారుతి, హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. టాప్‌-5లో ఉన్న కంటెస్టెంట్లలో మొదట ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌గా అలీ రెజా పేరును వారు వెల్లడించారు. దీంతో అలీ రెజా హౌజ్‌ నుంచి బయటకు వచ్చి హోస్ట్‌ నాగార్జునతో ముచ్చటిస్తూ.. తన అనుభవాలు పంచుకున్నారు. టాప్‌-5లో ఐదుగురు కంటెస్టెంట్లలో నేడు ముగ్గురు ఎమిలినేట్‌ అవనుండగా.. ఒకరు విజేతగా, మరొకరు రన్నరప్‌గా నిలువనున్నారు.

17 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన రియాటీ షో ఈసారి ప్రేక్షకులను గణనీయంగా అలరించిన సంగతి తెలిసిందే. జులై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ త్రీ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు శ్రీముఖి, రాహుల్‌ సిప్లింగజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా