బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

27 Aug, 2019 19:09 IST|Sakshi

ఆరోవారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ సోమవారం నాటి ఎపిసోడ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. గత మూడు వారాలుగా ఓపెన్‌ నామినేషన్‌ పెడుతున్న బిగ్‌బాస్‌.. ఆరో వారంలోనూ అదే పద్దతిని కొనసాగించాడు. ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో పునర్నవి వితికాను నామినేట్‌ చేయడం.. వరుణ్‌ను వితికా నామినేట్‌ చేసి.. పునర్నవిని సేవ్‌ చేయాలనుకోవడం లాంటి కొన్ని ఆసక్తికర  సంఘటనలు జరిగాయి. అయితే వీటన్నంటి కంటె మహేష్‌ తన స్ట్రాటజీని బయట పెట్టడం సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.

నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన తరువాత వరుణ్‌ సందేశ్‌, వితికాలతో ముచ్చటించిన మహేష్‌.. వాళ్లతో తన స్ట్రాటజీని పంచుకున్నాడు. ఈ నామినేషన్స్‌లో అలీని నామినేట్‌ చేద్దామని అనుకున్నానని, అయితే తాను కూడా నామినేషన్స్‌లో వచ్చేసరికి.. అలీ-రవి ఇద్దరిలో తక్కువ పర్ఫామెన్స్‌ ఇచ్చేది రవి కాబట్టి.. ఒకవేళ రవి నామినేషన్స్‌లో ఉంటే తాను సేవ్‌ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అందుకని రవిని నామినేట్‌ చేశానని బయటకు చెప్పాడు.

ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. రవికృష్ణ కంటే తనకు ఎక్కువ ఫేమ్‌ ఉందని మహేష్‌ భావిస్తున్నాడా? రవికృష్ణకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను తక్కువగా అంచనా వేస్తున్నాడా? బయటకు వచ్చిన రోహిణి కూడా రవినే సపోర్ట్‌ చేస్తుందని.. వీకెండ్‌లో తెలుస్తుంది ఎవరుంటారు? ఎవరు పోతారు?.. ఈ హౌస్‌లో ఒక్కక్షణం చాలు అంతా మారిపోవడానికి అంటూ రవికృష్ణ ఫాలోవర్స్‌ కామెంట్స్‌ చేస్తుండగా.. మహేష్‌ చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌.. ఆ నలుగురు విడిపోనున్నారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?