బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

28 Oct, 2019 15:49 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో రాహుల్‌ సిప్లిగంజ్, పునర్నవి లవ్‌ ట్రాక్‌ గురించి తెలియని వారుండరు. టాస్క్‌లు ఆడటం చేతకాదు అని పేరు తెచ్చుకున్న రాహుల్‌.. పునర్నవిని ఎలిమినేషన్‌ నుంచి తప్పించడానికి 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ తాగి తనపై ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడు. ఇక పదకొండో వారం.. పునర్నవి ఎలిమినేట్‌ అయినపుడు రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి మధ్య ప్రేమరాగాల్ని గుర్తు చేయడానికి ఓ కారణముంది. నిన్నటి (ఆదివారం)ఎపిసోడ్‌లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ దేవరకొండ బిగ్‌బాస్‌ షోలో సందడి చేశాడు. ఈ క్రమంలో కన్ఫెషన్‌ రూమ్‌లో ఉన్న విజయ్‌ దగ్గరకు ఒక్కో ఇంటి సభ్యుడు వచ్చి ‘రహస్య భేటీ’లో పాల్గొన్నారు. ఈ టాస్క్‌ ఉద్దేశం.. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇంతవరకు ఎవరితో షేర్‌ చేసుకోని ఒక రహస్యాన్ని కంటెస్టెంట్లు విజయ్‌తో పంచుకోవాలి. 

దాదాపు ఇంటి సభ్యులంతా సీక్రెట్స్‌ చెప్పలేక దాటవేసే సమాధానాలే ఇచ్చారు. ​కానీ, రాహుల్‌ మాత్రం నిర్మొహమాటంగా ఓ సీక్రెట్‌ను బయట పెట్టాడు. కెమెరాలకు కూడా చిక్కని రహస్యాన్ని నిన్నటి ఎపిసోడ్‌లో విజయ్‌తో చెప్పాడు. రాహుల్‌ మాట్లాడుతూ.. ‘తనకోసం కాకరకాయ జ్యూస్‌లు తాగినపుడు పునర్నవి నన్ను ముద్దుపెట్టుకోవడమే అందరికీ తెలుసు. మీకు తెలియని విషయమేంటంటే ఒకసారి కోపంలో ఆమె నా చేయి కొరికి, పారిపోయింది’ అని ఆ రహస్యాన్ని బహిర్గతం చేశాడు. దీనికి నాగార్జున కౌంటర్‌ వేశాడు. ‘వితిక.. కితకితలు పెడితే గిల్లిందని రాద్ధాంతం చేశావు. కానీ, పునర్నవి చేయి  కొరికినా కూడా ఏమీ అనలేదు’ అని రాహుల్‌ను ఆటపట్టించాడు. ఇక రాహుల్‌, పున్నూ మధ్య ఏదో ఉందని సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు