యాక్షన్‌

3 Feb, 2020 00:42 IST|Sakshi
చిరంజీవి

మాట వినని రౌడీలకు చేత్తో సమాధానం చెబుతున్నారు చిరంజీవి. మరి దెబ్బలు తిన్నాకైనా మాట విన్నారా? ఆ సంగతి సినిమా చూసి తెలుసుకోవాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సుమారు 20 కోట్ల ఖర్చుతో హైదరాబాద్‌ నగర శివార్లలో ఓ భారీ సెట్‌ను నిర్మించారని తెలిసింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఆ సెట్లో చిత్రీకరిస్తారట. ఆగస్ట్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు