డై..లాగి కొడితే....

19 Oct, 2016 23:40 IST|Sakshi
డై..లాగి కొడితే....

 సినిమా : ఇంద్ర
 రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: బి.గోపాల్
 వీరశంకర్ రెడ్డి (ముఖేష్ రిషి) చిన్న కొడుకును లారీ ప్రమాదం నుంచి ఇంద్రసేనా రెడ్డి (చిరంజీవి) కాపాడతాడు. ‘పగోడు పెట్టిన ప్రాణ భిక్షతో బ్రతికే బిడ్డ నాకొద్దు’ అంటూ వీరశంకర్ రెడ్డి తన కొడుకుని కత్తితో పొడిచి చంపి, శవాన్ని ఇంద్రన్నకు పంపిస్తాడు. ఆ బాలుడి శవాన్ని వీరశంకర్ రెడ్డి ఇంటికి తీసుకొస్తాడు ఇంద్రసేనా రెడ్డి.
 
 ఆ ఇంటి గుమ్మం ముందే పూడ్పించి, తులసి మొక్క నాటుతాడు. ‘చూడమ్మా.. నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప.. ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి’ అని వీరశంకర్ రెడ్డి భార్యకు చెప్పి వెళుతుండగా, వీరశంకర్ రెడ్డి ఆ మొక్కను పీకేయబోతాడు. అప్పుడు
 
 ‘వీరశంకర్ రెడ్డి..
 మొక్కే కదా అని పీకేస్తే
 పీక కోస్తా’
 అంటూ ఇంద్రసేనా రెడ్డి వార్నింగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ తెగ పాపులర్ అయింది.