డీ బ్రదర్స్‌ జోడీ అదుర్స్‌

18 Sep, 2018 00:46 IST|Sakshi
ఆకాంక్షా సింగ్, నాగార్జున; నాని, రష్మికా మండన్నా

డాన్, డాక్టర్‌ అంటూ ఇన్ని రోజులు ‘దేవదాస్‌’లు నాగార్జున, నాని గురించే మాట్లాడుకున్నాం. మరి వాళ్ల జోడీ ఎలా ఉంటారో సోమవారం రివీల్‌ చేసింది ‘దేవదాస్‌’ చిత్రబృందం. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’. అశ్వనీదత్‌ నిర్మించారు. ఇందులో నాగార్జున సరసన ‘మళ్ళీ రావా’ ఫేమ్‌ ఆకాంక్షా సింగ్, నానీకు జతగా రష్మికా మండన్నా యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ బ్యూటీలిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను రిలీజ్‌ చేశారు.

‘జాహ్నవీ’ పాత్ర పోషించిన ఆకాంక్ష సింగ్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తూ – ‘‘చాలా రోజుల తర్వాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి. ఏయ్‌!! మళ్లీ రొమాన్స్‌’’ అని నాగార్జున పేర్కొన్నారు. ‘‘ఫస్ట్‌ టైమ్‌ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే.. లోపల ఏదో రింగ్‌ అయింది పూజగారు. మళ్లీ ఎప్పుడు?’’ అంటూ పూజా పాత్రలో రష్మికా మండన్నా లుక్‌ను నాని రిలీజ్‌ చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ‘ఆడియో పార్టీ’ ఈ నెల 20న జరగనుంది. బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ వయాకమ్‌ 18 ప్రొడక్షన్‌లో భాగమైందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్‌ కానుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

కమాండర్‌ విజయ్‌

సౌత్‌కి బదాయి హో

కష్టమంతా మరచిపోయాం

డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు