వాస్తవ సంఘటనలతో...

29 May, 2018 02:19 IST|Sakshi
తేజ

సోమవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా రాజకిరణ్‌ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్‌.  సినిమాకు మాధవి అద్దంకి, రజనీకాంత్‌ యస్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘గీతాంజలి, త్రిపుర’ చిత్రాల దర్శకుడు రాజకిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత తేజ ఎన్టీఆర్‌ చిత్ర పటానికి నమస్కరించి, చిత్ర పటంపై క్లాప్‌నిచ్చి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్‌ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం.

సినిమా మొదటి ఫ్రేమ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. నా గత చిత్రాలైన ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో ఎన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అదే  థ్రిల్‌ మెయింటేన్‌ చేస్తుంది. జూన్‌ మూడవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. మంచి నాయకా,నాయికలు దొరికారు. అతి త్వరలో మిగతా విషయాలు తెలియజేస్తాం’’ అన్నారాయన. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడైన ఆకెళ్ల వంశీకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్‌:ఉపేంద్ర, ఆర్ట్‌:చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: రాజకిరణ్‌

మరిన్ని వార్తలు