-
చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని
సాక్షి, విజయవాడ: లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించాడని, కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదని నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా విజవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్ వన్ హీరో అని తెలుసు.. కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవాడని తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. (చదవండి: వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి ) ఎన్టీఆర్ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నాడు. లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించాడు. ఇదే విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించలేదు. ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆయన్ని బతికించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. ఈమె మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుంది. కానీ వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలి’అని పోసాని అన్నారు. -
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!
దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది. (చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు! ) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. అయితే తన 40వ పుట్టినరోజు (మే 20) కూడా ఇదే రోజు కావడంతో.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగానే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. -
తనికెళ్ల భరణికి లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సోమవారం ప్రదానం చేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు మోహన్‌బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్‌లను కూడా సత్కరించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు అందజేశారు. 18 సంవత్సరాలుగా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని అతిథులు కొనియాడారు. -
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
స్వర్గీయ మహానటుడు నందమూరి తారక రామారావు వారసులు చాలా మంది టాలీవుడ్లో రాణిస్తున్నారు. తాజాగా మరో వారసుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. శనివారం బసవతారకరామ బ్యానర్, తొలి చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘మా అమ్మ, నాన్నగార్ల పేర్లు కలిసొచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్‌కు పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. నాన్నగారికి ఎంతో ఇష్టమైన చైతన్య ఈ బ్యానర్లోని సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీ. అన్నయ్య జయకృష్ణ, దర్శకుడు వంశీకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్‌్టతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు జయకృష్ణ. ‘‘మా నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్’ను బాబాయ్ బాలకృష్ణగారు లాంచ్ చేసి, ఆశీస్సులు అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు చైతన్య కృష్ణ. రెండు షేడ్స్ కల్యాణ్‌రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ శతజయంతి(మే 28) సందర్భంగా ‘బింబిసార’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడిగా, మోడ్రన్ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
టీడీపీకి మహానాడు జాకీలు
సాక్షి, అమరావతి: పాతాళానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీని కొద్దిగానైనా పైకి లేపి రాజకీయ రేసులో ఉన్నామని చెప్పుకొనేందుకు చంద్రబాబు మహానాడు ద్వారా తాపత్రయపడ్డారు. నిస్తేజంలో కూరుకుపోయిన శ్రేణులు, భవిష్యత్తుపై బెంగతో అస్త్ర సన్యాసం చేసిన నాయకుల్ని కదిలించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానిక ఎన్నికల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస పోటీ కూడా ఇవ్వలేక దారుణంగా ఓడిపోవటంతో పార్టీ యంత్రాంగం నీరసించిపోయింది. చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా నాయకులు, శ్రేణులు పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారా ఏదో ఉన్నామని చూపించుకోవడం తప్ప పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి లేకుండాపోయింది. మెజారిటీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు కూడా లేరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన నేతలు, మంత్రుల్లో నలుగురైదుగురు మినహా మిగిలిన వాళ్లెవరు మూడేళ్లుగా బయటకు రాలేదు. దీంతో కొంత కాలంగా యువతకు అవకాశం పేరుతో జూనియర్ నాయకులను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్ని కొంతైనా కదిలించాలని ప్రయత్నించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బూతులు, తిట్లు పార్టీ ముందడుగు కోసం నిర్వహించే మహానాడు వేదికను పూర్తిగా బూతులమయంగా మార్చివేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని నోటికి వచ్చినట్లు కొందరు నేతలతో మాట్లాడించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని వ్యతిరేకించి అభూత కల్పనలతో బురద జల్లేందుకు మహానాడును ఉపయోగించుకున్నారు. అందులో భాగంగానే ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు చేసి ప్రతి దాన్ని తిట్లు, శాపనార్థాలతో నింపేశారు. మరోవైపు మహానాడు ముగింపు సభకు కార్యకర్తలు రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు వారం ముందు నుంచే తప్పుడు ప్రచారానికి దిగారు. బస్సులు ఇవ్వడంలేదని ఆరోపణలు చేశారు. చంద్రబాబు, ఇతర నేతలు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి నియోజకవర్గాల వారీగా నాయకులకు టార్గెట్లు ఇచ్చి కచ్చితంగా అంతమందిని ఒంగోలుకు తీసుకురావాలని ఆదేశించారు. అంతమందిని తేలేమని చాలామంది చేతులెత్తేయడంతో జనం రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ ముందస్తుగా ప్రచారాన్ని లేవనెత్తారు. ఎన్టీఆర్‌కు దక్కని సముచిత గౌరవం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహానాడులో ఆయనకు మాత్రం సముచిత గౌరవం ఇవ్వలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రతి మహానాడులో తీర్మానం చేస్తున్నారు. అయితే, ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడులో ఈ తీర్మానమే లేదు. ఆయన పేరును చెప్పుకోవడానికే నేతలు పరిమితమయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడం తప్ప ఆయన్ను గౌరవించేలా ఒక్క పనీ చేయలేదు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించింది. సీఎం జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్‌తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement