బర్త్‌డేకి బండొచ్చింది

15 Jul, 2018 00:55 IST|Sakshi
దుల్కర్‌ సల్మాన్‌

ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ బర్త్‌ డే. 28 రాకముందే బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆకర్ష్‌ ఖురానా నుంచి అడ్వాన్స్‌ బర్త్‌డే ప్రజెంట్‌ అందుకున్నారట దుల్కర్‌. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్‌ ఖాన్, మిథిలా పాల్కర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్‌ బేస్డ్‌ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్‌ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్‌. ఇప్పుడు అదే వ్యాన్‌ను దుల్కర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్‌. ‘‘సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం ఈ వ్యాన్‌లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్‌తో ఎమోషనల్‌గా అటాచ్‌ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్‌ మీద దుల్కర్‌కు ఇంట్రెస్ట్‌ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు