ముస్లిం సోదరులకు రానా, సినీ పరిశ్రమ శుభాకాంక్షలు

29 Jul, 2014 13:13 IST|Sakshi
గాజాలో మరణించిన చిన్నారుల కోసం రంజాన్ పవిత్ర దినం రోజున ప్రార్థన నిర్వహించాలని బాలీవుడ్ ప్రముఖుడు అనురాగ్ బసు సూచించారు. ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం రోజున బాలీవుడ్, టాలీవుడ్, పలు రాజకీయ ప్రముఖులు శుభాంకాంక్షలు తెలిపారు. 
 
కులం, ప్రాంతం, భాషలకతీతంగా భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖులు ముస్లిం సోదరులకు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో తమ సందేశాలను పోస్ట్ చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో దగ్గుబాటి రానా, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, నయనతార, శరత్ కుమార్, జయం రవి తదితరులున్నారు.