చాణక్య వ్యూహం

10 Jun, 2019 05:16 IST|Sakshi

అవును.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు గోపీచంద్‌. మరి.. ఈ వ్యూహాలు ఎంత వరకు సఫలం అయ్యాయి? అతనికి ఎదురైన అడ్డంకులు ఏంటి? అనే ఆసక్తికర అంశాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మెహరీన్, జరీనా ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను దర్శక–నిర్మాతలు ఆదివారం ఆవిష్కరించారు. ‘‘యాభై శాతానికి పైగా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికపాటి, మాటల రచయిత: అబ్బూరి రవి.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా