వారి ప్రశంసకు మురిసిపోయిన జాన్వీ

23 Jun, 2018 20:47 IST|Sakshi

ముంబై : అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలోనే తను నటించిన ‘ధడక్‌’ సినిమా తెరపైకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూసిన వారంతా.. జాన్వీ నటనను, అందాన్ని చూసి ఫిదా అంటూ కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. తొలి సినిమానే అయినా జాన్వీ చాలా అద్భుతంగా నటించిందని, హావభావాలను పలికించిన తీరు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇన్ని ప్రశంసల్లో ఓ కాంప్లిమెంట్‌ తన హృదయాన్ని తాకిందట. అది అన్న అర్జున్‌ కపూర్‌ మెచ్చుకోలు. 

‘ఈ సినిమాలో నీవు చాలా నిజాయితీతో నటించినట్టు ఉంది. హీరోయిన్‌ మాదిరి నీవు నటించలేదు. పాత్రలో లీనైపోయావు. నిజాయితీగా నీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించావు’ అని అర్జున్‌ ప్రశంస ఇచ్చాడట. ఈ మెచ్చుకోలును తన బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా జాన్వీ చెప్పింది. అర్జున్‌ నుంచి వచ్చిన ఈ ప్రశంసతో తాను చాలా సంతోషంగా ఫీల్‌ అయినట్టు పేర్కొంది. అంతేకాక తన తండ్రి బోని కపూర్‌ కూడా ‘వావ్‌, ఎంత సహజంగా నీవు నటించావు’ అని ప్రశంసించారట. ఈ ఇద్దరి కాంప్లిమెంట్‌తో తాను చాలా ఖుషీగా ఉన్నట్టు జాన్వీ ఇటీవల ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. కాగ, ధడక్‌లో జాన్వీకి జోడిగా షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖట్టర్‌ నటించాడు. జాన్వీ, ఇషాన్‌ ఇద్దరూ పోటీపడి నటించినట్టు ఉందని, ఇషాన్‌ ఖట్టర్‌ నటన కూడా అద్భుతంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. మరాఠి హిట్ మూవీ ‘సైరాట్' రీమేక్‌గా ‘ధడక్' చిత్రాన్ని తెరకెక్కించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా