హీరో రానాకు స్వల్ప గాయాలు

29 Jun, 2013 20:25 IST|Sakshi
హీరో రానాకు స్వల్ప గాయాలు
హీరో దగ్గుబాటి రానా శనివారం సాయంత్రం స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. బాహుబలి చిత్రం కోసం గుర్రం స్వారీ శిక్షణ జరుగుతుండగా కింద పడినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో కుడికాలికికి గాయమైనట్టు అధికారికంగా తెలిసింది. వెంటనే రానాను బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించి.. ఎక్స్ రే, తదితర పరీక్షలు నిర్వహించారు. రానా ప్రమాదం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చిత్రానికి సంబంధించిన వారు తెలిపారు. రేపట్నించి యధావిధిగా శిక్షణలో పాల్గొంటారని తెలిపారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందే ఈ చిత్ర షూటింగ్ వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్కలు నటిస్తున్నారు.