డైరెక్షన్‌ చేయాలనుంది

29 Oct, 2018 01:31 IST|Sakshi
లైలా

‘ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్రప్రేమ, శివ పుత్రుడు’ వంటి చిత్రాలతో నటిగా మంచి పాపులారిటీ సంపాదించారు లైలా. 2006లో వ్యాపారవేత్త మెహ్‌దిన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారామె. అయితే, పన్నిండేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలనుకుంటున్నారట లైలా. సినిమాల్లో కమ్‌బ్యాక్‌ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘దక్షిణ రాష్ట్రాల నుంచి మళ్లీ చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ, మంచి రోల్‌తో కమ్‌బ్యాక్‌ చేయాలని ఎదురుచూస్తున్నాను. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అయితే ఇంకా సరదాగా ఉంటుంది. భవిష్యత్తులో డైరెక్షన్‌ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు. మరి ఎలాంటి క్యారెక్టర్‌తో లైలా తిరిగొస్తారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు