ఐశ్వర్య అర్జున్ చిత్రానికి హాలీవుడ్ నృత్యదర్శకురాళ్లు

8 Oct, 2016 02:25 IST|Sakshi
ఐశ్వర్య అర్జున్ చిత్రానికి హాలీవుడ్ నృత్యదర్శకురాళ్లు

హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు యువ నటి ఐశ్వర్యఅర్జున్‌తో స్టెప్స్ వేయించారు. హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు పూనంషా, ప్రియాంకాషా హాలీవుడ్, బాలీవుడ్‌ల్లో బహుళ ప్రాచుర్యం పొందారు. వారినిప్పుడు నటి ఐశ్వర్యఅర్జున్ కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. యాక్షన్‌కింగ్ అర్జున్ వారసురాలు ఐశ్వర్యఅర్జున్ అన్న విషయం తెలిసిందే. ఇక అర్జున్‌లో మంచి దర్శక నిర్మాత కూడా ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
ఆయన తన శ్రీరామ్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో  చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాదలిన్ పోన్ వీధియిల్ పేరుతో తెరకెక్కిస్తున్న ఇందులో తన కూతురు ఐశ్వర్య అర్జునే నాయకి. నవ నటుడు చందన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఓ పాటకు హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు పూనంషా, ప్రియాంకాషా కొరియోగ్రఫి అందించడం విశేషం.
 
రంతాజోగి, తాళ్‌డాన్స్ తో పాటు భరతనాట్య ంలోనూ ప్రావీణ్యం పొ ందిన పూనంషా, ప్రియా ంకాషాలను ఈ చిత్రానికి నృ త్యదర్శకత్వం వహించాలన్న ఐశ్వర్య అర్జున్ కోరిక మేరకు  వాళ్లను ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రఖ్యాత దర్శకుడు కే.విశ్వనాథ్, సుహాసిని, మొట్టై రాజేంద్రన్, మనోబాలా, సతీష్, బ్లాక్‌పాండి, బోండామణి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. జాస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు.