ఇది కొత్తవాళ్ళ హౌస్!

28 Sep, 2016 00:45 IST|Sakshi
ఇది కొత్తవాళ్ళ హౌస్!
‘‘నటుడు ఉత్తేజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశా. ఆయన్ను బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ప్రతి విషయంపై అవగాహన వచ్చింది. ఆ అనుభవంతోనే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘హౌస్’ తెరకెక్కించా. దర్శకుణ్ణి కావాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు దర్శకుడు రాజుశెట్టి. జై, వసుంధర జంటగా ఆయన దర్శకత్వంలో బోయన కృష్ణారావు నిర్మించిన చిత్రం ‘హౌస్’. శశాంక్ భాస్కరుణి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. 
 
 త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు నిర్మాత. ‘‘నా శిష్యుడు రాజుశెట్టి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త వారందరూ కలిసి చేసిన ఈ చిత్రం విజయవంతమవ్వాలి’’ అని ఉత్తేజ్ అన్నారు. కృష్ణారావు, దర్శకుడు క్రాంతిమాధవ్, నిర్మాత ముత్యాల రాందాస్, హీరో మానస్ పాల్గొన్నారు.